Vemulawada: కేటీఆర్ మాటల్లో బేలతనం కనిపిస్తోంది.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

by Ramesh Goud |
Vemulawada: కేటీఆర్ మాటల్లో బేలతనం కనిపిస్తోంది.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్(KTR) అసహన ప్రెస్ మీట్ లో ఓ వైపు గంభీరం కనిపిస్తున్నా.. ఆయన మాటల్లో బేలతనం కనిపిస్తోందని వేములవాడ ఎమ్మెల్యే(Vemulawada MLA), ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President) కేటీఆర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. అడ్వకేట్లను మాట్లాడుతున్న అని ఆయన చెప్పారంటేనే కుంభకోణం జరిగినట్లు చెప్పకనే చెబుతున్నారని అర్థం అవుతుందన్నారు. కాదేది కబ్జాలకు అనర్హం అన్నట్లు సిరిసిల్లలో పది రకాల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. తెలంగాణ భవనం(Telangana Bhavan) కోసం కేటాయించిన స్థలం కూడా కబ్జాకు గురైనదేనని, వీటిపై కేటీఆర్ గుండె మీద చెయి వేసుకొని చెప్పాలని అన్నారు.

అర్హులకు చెందాల్సిన భూములు అక్రమంగా కబ్జాలు చేశారని, కేటీఆర్ ఆదర్శంగా ఉండాలనుకుంటే తెలంగాణ భవన్ కేటాయించిన భూమి కాకుండా, కబ్జా చేసినది ప్రభుత్వానికి ఇచ్చి, సమాధానం చెప్పాలని సూచించారు. అర్హులకు చెందాల్సిన అధిక ధరలు కలిగిన పది రకాల భూములను కబ్జా చేశారని, ఇందులో జంగ్ సిపాయి, శిఖం, పోరంబోకు, బంచరాయి, అసైన్ మెంట్, లావణి పట్టా, దేవాలయ, ఫారెస్ట్, చెరువు భూములు, గారీజ్ ఖాతాలకు చెందిన భూములను కబ్జాలకు గురి చేశారని మండిపడ్డారు. కబ్జా చేసిన భూములను కొందరు తిరిగి ఇస్తుంటే కేటీఆర్ అడ్డుపడుతున్నారని, ఇప్పటికే 200 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇక ప్రజా పాలనను సంక్షేమం వైపు నడిపిస్తుంటే చీటికి మాటికి ప్రెస్ మీట్లు పెట్టి విష ప్రచారాలు చేస్తున్నారని, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆది శ్రీనివాస్ తేల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed