- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అవును.. మెహుల్ చోక్సీ మా దేశంలోనే ఉన్నాడు

- నిర్ధారించిన బెల్జియం
- చోక్సీ కేసులపై వ్యాఖ్యానించడానికి నిరాకరణ
- అప్పగింత కోసం భారత్ సంప్రదించిందని వెల్లడి
దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ నేషనల్ బ్యాంకు వద్ద రూ.13,500 కోట్ల రుణం తీసుకొని మోసం చేసి కేసులో ప్రధాన నిందితుడైన మెహుల్ చోక్సీ తమ దేశంలోనే ఉన్నాడని బెల్జియం నిర్ధారించింది. పీఎన్‌బీ స్కామ్ తర్వాత దేశం వదిలి వెళ్లిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ యూరోపియన్ దేశం బెల్జియంలో ఉన్నట్లు ఎన్డీటీవీకి చెప్పింది. చోక్సీ ఉనికి తమకు తెలుసని, ఆయన మీద నమోదైన కేసు ప్రాముఖ్యత కూడా తెలుసని.. దీనిపై తాము శ్రద్ధవహిస్తున్నట్లు బెల్జియం విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మెహుల్ చోక్సీపై నమోదైన వ్యక్తిగత కేసుల గురించి తాము వ్యాఖ్యానించబోమని.. అయితే ఈ కేసులో ముఖ్యమైన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. మెహుల్ చోక్సీ అప్పగింత ప్రక్రియ ప్రారంభించడానికి భారత అధికారులు ఇప్పటికే బెల్జియం అధికారులను సంప్రదించారని న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రచురించింది.
పీఎన్‌బీ కేసులో సహనిందితుడు, చోక్సీ మేనల్లుడైన నీరవ్ మోడీని లండన్ నుంచి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. పీఎన్‌బీ స్కామ్ కేసులో నిందితుడైన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీ చోక్సీతో కలిసి ఆంట్వెర్ఫ్‌లో నివసిస్తున్నాడు. వీరు బెల్జియంలో ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందినట్లు తెలుస్తుంది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడాను విడిచిపెట్టినప్పటికీ.. ఇంకా ఆ దేశ పౌరసత్వాన్ని చోక్సీ కలిగి ఉన్నాడు. ఇటీవల రైసీనా డైలాగ్‌లో పాల్గొనడానికి ఇండియాకు వచ్చిన కరేబియన్ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఈ.పి. చెట్.. చోక్సీ గురించి చెప్పారు. ప్రస్తుతం అతడు తమ దేశంలో లేడని.. ఎక్కడికి వెళ్లాడో తెలియదని చెట్ గ్రీన్ పేర్కొన్నాడు.