- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Health tips: వేసవిలోనే దొరుకుతాయని ఈ పండ్లు అతిగా తింటున్నారా?

దిశ, వెబ్ డెస్క్: వేసవి (Summer) కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగ భగలకు ప్రజలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. అంతేకాదు, ఎండ వేడిమి కారణంగా శరీరం తరచూ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అందుకే సమ్మర్‌లో ఆరోగ్యపట్ల మరింత ఎక్కువ శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తుంటారు. నీటి శాతం ఎక్కువ ఉండే పండ్లు, కూరగాయలు తినాలని చెబుతుంటారు. అయితే, వేసవిలో తినకూడని పండ్లు (Fruits) కూడా కొన్ని ఉంటాయి. ఇవి తింటే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి (Papaya) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇందులో ఫైబర్, విటమిన్ సి, కెరోటిన్, అర్జినైన్, కార్బైన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే, బొప్పాయిని వేసవిలో అధికంగా తినటం మంచిది కాదు. ఎందుకంటే.. బొప్పాయి స్వభావరీత్యా వేడి చేస్తుంది. అతిగా తింటే శరీరంలో వేడి చేస్తుంది. విరేచనాల సమస్య రావచ్చు.
సమ్మర్ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడి (Mango) పండ్లు. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. కానీ వీటిని అతిగా తింటే శరీరానికి వేడి చేస్తుంది. మామిడి పండ్లు ఎప్పుడూ మితంగానే తినాలి. లేదంటే చర్మంపై దద్దుర్లు, విరేచనాలు, నోటిలో వేడి పుండ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లకు దూరంగా ఉండాలి.
ఇక వేసవి కాలం లభించే పండ్లలో లిచీ (Lychee) కూడా ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, వీటిని పరిమితికి మించి తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు అస్సలు తినకూడదు. అలాగే, గర్భంతో ఉండే మహిళలు ఈ పండ్లను తినకపోవడమే శ్రేయస్కరం.