- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముంపు గ్రామాల ప్రజలకు భరోసా కల్పించాలి.. ఎమ్మెల్యే

దిశ, మక్తల్ : నియోజకవర్గంలోని పలు గ్రామాలు ముంపు గురై ప్రజల అవస్థలు పడుతున్నారని వారికి భరోసా కల్పించాలని బుధవారం అసెంబ్లీలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రస్తావించారు. ప్రస్తుతం మక్తల్ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం కింద భూముల కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారని. గత 20 సంవత్సరాల కిందట జూరాల ప్రాజెక్టులో అంకెనపల్లి, అనుగొండ, పారేవుల, దాదన్ పల్లి, ముష్ఠిపల్లి గ్రామాలు నిర్వాసితం గ్రామాలుగా ప్రకటించిన వారికి ఇప్పటి వరకు పూర్తి సహాయం అందలేదని, అదేవిధంగా బీమా ప్రాజెక్ట్ అంతర్భాగమైనా సంగంబండ, ఉజ్జల్లి, భూత్పూర్, నేరడగోమ్ము గ్రామాలు ముంపు గురయ్యావని 122 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది తప్ప ఇప్పటి వరకు నిర్వాసిత ప్రజలకు చేపట్టాల్సిన చర్యలు తీసుకోలేదన్నారు.
వర్షాకాలంలో ప్రాజెక్టు నిండినప్పుడు ముంపు నివాసిత ఇళ్ళలోకి విషపు పురుగులు వస్తున్నాయని. ముంపు గ్రామాల ఇళ్లల్లో నీటి ఊటలు రావడం దానివల్ల నిర్వాసిత గృహలో గోడలు నెర్రెలు పాసి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్ళలో భయం భయంగా ప్రజలు బతుకు నెట్టు కొస్తున్నారని. ఈ విషయం పై ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పించేలా హామీలతో పాటు ఆచరణలో రావాలని, దీనివల్ల సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మక్తల్ నాన్ పేట్ కొనంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు తమకు నష్టపరిహారం వస్తుందన్న భరోసాతో ఉంటారని. అందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అసెంబ్లీలో ప్రస్తావించారు.