Ukraine: నల్ల సముద్రంలో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ రష్యా అంగీకారం.. వెల్లడించిన వైట్ హౌస్

by vinod kumar |
Ukraine: నల్ల సముద్రంలో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ రష్యా అంగీకారం.. వెల్లడించిన వైట్ హౌస్
X

దిశ, నేషనల్ బ్యూరో: నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను అపడానికి రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein) మధ్య అగ్రిమెంట్ జరిగింది. దీనికి సంబంధించి రష్యా, ఉక్రెయిన్‌లతో అమెరికా వేర్వేరు డీల్స్ కుదుర్చుకుంది. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. వాణిజ్య నౌకలను సైనిక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబోమని తెలిపింది. యుద్ధ ఖైదీల మార్పిడికి, రష్యాకు బలవంతంగా పంపబడిన ఉక్రేనియన్ పిల్లలను తిరిగి ఇవ్వడానికి యూఎస్ మద్దతిస్తూనే ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఒప్పందం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే వివరాలను యూఎస్ వెల్లడించలేదు. ఈ ఒప్పందాలు అమలైతే మూడేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చల దిశగా ఒక అడుగు పడినట్టేనని భావిస్తున్నారు.

ఒప్పందాలను అమలు చేయడానికి రెండు దేశాలు అమెరికాపై ఆధారపడతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. నల్ల సముద్రం, ఇంధన సదుపాయాలపై దాడులు ఆపివేయడం వెంటనే అమల్లోకి వచ్చిందని చెప్పారు. రష్యా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే వారిపై మరిన్ని ఆంక్షలు విధించాలని అధ్యక్షుడు ట్రంపునకు విజ్ఞప్తి చేస్తానన్నారు. కాగా, సౌదీ అరేబియాలో అమెరికా ప్రతినిధులు రష్యా, ఉక్రెయిన్ లతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా ఒప్పందాలు కుదిరాయి.



Next Story