- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సచివాలయ బీసీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సెక్రటేరియేట్ బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గా టి.శేఖర్, అధ్యకుడుగా తిరందాస్ యాదగిరి ఎన్నికయ్యారు. గురువారం తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగులందరూ సమావేశమై, బీసీ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంఘానికి గౌరవ అధ్యక్షుడుగా టి. శేఖర్, అడిషనల్ సెక్రటరీ, అధ్యక్షుడుగా తిరందాస్ యాదగిరి, అసిస్టెంట్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిగా దీటి శ్రీకాంత్, కోశాధికారిగా నవీన్ కుమార్, అలాగే ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో, బీసీ ఉద్యోగులంతా బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతూ బిల్లును ఆమోదించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాక, ప్రభుత్వానికి సంఘీభావంగా నిలిచి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో తమ వంతు కృషి చేస్తామని, ఈ బాధ్యతను ప్రధానంగా నిర్వర్తిస్తామని తీర్మానించారు.