- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
4న ఎర్రవెల్లికి ఆలేరు బీఆర్ఎస్ శ్రేణులు.. ఎందుకంటే ..?

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఏప్రిల్ 4న ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఎర్రవెళ్లికి వెళ్లి మాజీ సీఎం కేసీఆర్ ను కలవనున్నట్లు పార్టీ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య వెల్లడించారు. యాదగిరిగుట్ట పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలో ఏర్పడిన కరువుతో పాటు యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపైన కేసీఆర్ ను కలిసి వివరించనున్నట్లు పేర్కోన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలంతా మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ అంశంపై కేసీఆర్ తోనే నేరుగా రైతులు చెబుతారన్నారు. త్వరలోనే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి కేసీఆర్ రావాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆహ్వానించనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు, రైతులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు కలవనున్నట్లు వెల్లడించారు. ఈ పాదయాత్రను మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలు యాదగిరిగుట్ట శ్రీ స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డమీద రవీందర్ గౌడ్, పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి, యూత్ అధ్యక్షులు ముక్కేర్ల సతీష్ యాదవ్, నాయకులు కొన్యాల నర్సింహరెడ్టి, గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్, దేవపూజ అశోక్, శారాజీ రాజేష్ తదితరులున్నారు.