- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సభలో ఫొటోలు తీసిన హరీష్ రావు... చర్యలు తీసుకుంటామన్న స్పీకర్

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ హౌస్ఫొటోలు తీయడం సభ నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. సభను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్నాయకులు చూస్తున్నారని విమర్శించారు. శాసన సభ సమావేశాలు జరుగుతుండగా నిబంధనలు విరుద్ధం హౌజ్‌లో హరీశ్‌రావు ఫొటోలు తీయడాన్ని తప్పుబట్టారు. పదేండ్లు ప్రభుత్వంలో ఉండి, మంత్రిగా, శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేసినటువంటి హరీశ్‌రావు శాసన సభ లాబీలో నినాదాలు, ఎమ్మెల్యే ఎంట్రెన్స్ పాయింట్దగ్గర ధర్నా చేయడం ఎంత వరకు కరెక్టు అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఫొటోలు అన్నింటిని కూడా బయట ప్రపంచంలోని గ్రూపులల్లోకి పంపారని, ది ఎస్టేట్దాంట్లో కూడా పోస్టు చేసి, సభను తప్పదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సభ ఆరణలో కానీ, లోపల కానీ స్పీకర్అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని పార్లమెంట్రూల్స్బుక్ప్రకారం.. పోటోగ్రాఫ్, ఫీల్మ్గ్రాఫ్ ఆర్స్కెచ్వేయడం నిషేధం నిబంధన ఉన్నా.. హరీశ్‌రావు గత రాత్రి ఫొటోలు తీశారని స్పీకర్దృష్టికి తెచ్చారు.
శాసన సభకు సంబంధించి సాంప్రదాయాలను పక్కనపెట్టి బీఆర్ఎస్నాయకత్వం సభలో చేపట్టిన నిర్వాహకంపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. బీఆర్ఎస్ సభ్యులకు స్పీకర్చైర్అంటే లెక్కలేదు.. సీఎం అంటే ఈర్శ్య భావం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై నింధరోపణలు.. ఈ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు ప్రయత్నాలు తప్పా మరొకటి లేదని ఆది శ్రీనివాస్పేర్కొన్నారు. పదిహేను నెలల కాలంలో సర్కారు చేపట్టిన పాలసీలను ఈ సభ ద్వారా ప్రజలకు తాము తెలియజేస్తుంటే.. బీఆర్ఎస్నేతలు రన్నింగ్ కామెంట్రీ ద్వారా అడ్డుపడుతూ గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. సభలో ఫొటోలు తీసిన విషయమై వినతి పత్రం కూడా ఇచ్చామని, తగు చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్ఈసందర్భంగా స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు. కాగా, ఈ విషయాన్ని ఎగ్జామిన్చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పీకర్తెలిపారు. సంప్రదాయాలను, గౌరవాలను, ప్రతిష్టను పెంచాలంటే.. అలాంటి కార్యక్రమాలు చేయవద్దని సభముఖంగా సభ్యులందరికీ స్పీకర్విజ్ఞప్తి చేశారు.