మండలిలో సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్సీలకు సన్మానం

by M.Rajitha |
మండలిలో సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్సీలకు సన్మానం
X

దిశ, తెలంగాణ బ్యూరో : శాసన మండలిలో పదవీకాలం ముగిసిన 9మంది ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తుసుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనమండలి ప్రాంగణంలో గురువారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిధిగా ఆహ్వనించారు. సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్సీలకు షీల్డ్స్ అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాసనమండలి ఛైర్మన్ గుత్తుసుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ 9 మంది ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుందని గురువారం అఖరి రోజుగా సమావేశాలలో పాల్గొన్నారని వారికి ఘనంగా వీడ్కోలు పలకాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తుసుఖేందర్ రెడ్డి తెలిపారు. సభ్యులలో మంత్రులుగా చేసిన వారు ఉన్నారని వారి అనుభవాలను నూతన సభ్యలు స్ఫూర్తిగా తీసుకొవాలని సూచించారు. సభ్యుల అనుభవాలను పంచుకోవాలని తెలిపారు. వీడ్కోలు సభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలను ఆహ్వనించారు. ముల్క కోమరయ్య, శ్రీపాల్ రెడ్డి, సత్యం, అద్దంకి దయాకర్, అంజిరెడ్డిలను ఆహ్వనించారు.

ఎమ్మెల్సీలలో మొదటగా స్థానిక సంస్థల ద్వారా ఎన్నకోడిన ఎమ్మె్ల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు మాట్లాడారు. ఎమ్మెల్సీగా సుధీర్ఘకాలం పని చేసినట్లు తెలిపారు. 15సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నానని , మా తండ్రి శ్యామలరావు కూడా ఇదే సభలో 10 సంవత్సరాలు ఉన్నారని అన్నారు. శాసన మండలితో మా కుటుంబానికి అత్యంత అత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లడుతూ 6సార్లు శాసన సభలో ఉన్నానని మూడు సార్లు ప్రతిపక్షంలో , మూడు సార్లు అధికార పక్షంలో ఉన్నానని తెలిపారు. కాని శాసనమండలిలో ఎమ్మెల్సీగా చేయడం సంతృప్తినిచ్చిందని అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ హోం మంత్రి, మాజీ రెవెన్యూ మంత్రి మహబూబ్ ఆలీ, యగ్గ మల్లేశం, అలుగుబెల్లి నర్సిరెడ్డి ( టీచర్స్ ఎమ్మెల్సీ ), శేరి సుభాష్ రెడ్డి, కూర రఘోత్తమ రెడ్డి ( టీచర్స్ ఎమ్మెల్సీ ), మాజీ మంత్రి సత్యవతి రాధోడ్, మిర్జా రియాజుల్ హసన్ ఇఫెంది తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ నెల 29వ తేదితో వారి పదవీకాలం ముగుస్తుంది.

Next Story

Most Viewed