- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Toll Charges: వాహనదారులకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన టోల్ ఛార్జీలు

దిశ, వెబ్‌డెస్క్: వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ (Hyderabad) - విజయవాడ (Vijayawada) జాతీయ రహదారి (National Highway)పై టోల్ గేట్ల (Toll Gates) వద్ద వివిధ వాహనాకు చెల్లించే రుసుమును తగ్గి్స్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన టోల్ చార్జీలు (Toll Charges) ఇవాళ అర్థరాత్రి తరువాత అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుండగా మార్చి 31, 2026 వరకు అవే చార్జీలు అమల్లో ఉండనున్నాయి. హైదరాబాద్ – విజయవాడ (65) జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి (Panthangi), కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ (Korlapahad), ఏపీలో చిల్లకల్లు (నందిగామ) (Chillkallu) వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. అయితే, రోడ్డు నిర్మించిన జీఎంఆర్ (GMR) ఆధ్వర్యంలో ఆయా టోల్ ప్లాజాల్లో 2012 డిసెంబర్ నుంచి టోల్ వసూళ్లు ప్రారంభం కాగా 2024 జూన్ 31వరకు ఆ సంస్థ టోల్ వసూళ్లు, రహదారి నిర్వహణను పర్యవేక్షించింది. అయితే, జూలై 1 నుంచి టోల్ వసూళ్లను NHAI ఏజెన్సీల ద్వారా చేపడుతుండటంతో టోల్ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో పంతంగి (Panthangi) టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30 వసూలు చేయనున్నారు. ఇక లైట్ వేయిట్ వాహనాలను ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40 చార్జ్ చేయనున్నారు, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ చార్జాల్లో 25 శాతం మినహాయింపు ఇవ్వనున్నారు.