- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్సీ నాగబాబుకి అన్న చిరంజీవి ఖరీదైన గిఫ్ట్.. ఇంతకీ అదేంటో తెలుసా..?

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గత మార్చి నెలలో జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నాగబాబు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, మెగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
శాసన మండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నాగబాబు.. తన అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్నారు. చిరంజీవి, సురేఖ దంపతులు నాగబాబును పూల మాలతో సత్కరించారు.అంతే కాకుండా ఖరీదైన పెన్నును కానుకగా అందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా ఆనందాన్ని పంచుకున్నారు. ఆ పోస్టులో "ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో అన్నయ్య, వదిన" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు.
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన..తమ్ముడు నాగబాబుకు ఆత్మీయ అభినందనలు అంటూ చిరు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే చిరు పోస్ట్ పై నాగబాబు స్పందించారు. మీ ప్రేమ, తోడ్పాటుకు ధన్యవాదాలు.. మీరు ఇచ్చిన పెన్ నాకు ఎంతో ప్రత్యేకం. నా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ పెన్ ఉపయోగించడం గౌరవంగా భావించా అని నాగబాబు ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.