- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి
by Kalyani |

X
దిశ, తాడూరు : కారు స్కూటీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని యంగంపల్లి గేటు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన మామిడికాయల వ్యాపారి పెబ్బేటి రాములు(55) శుభకార్యానికి వెళ్లి స్కూటీపై తిరిగి వస్తుండగా సోమవారం సాయంత్రం యంగంపల్లి గేటు వద్ద ఎదురుగా వస్తున్న TS07HY 6372 నెంబరు కారు ఎదురుగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్న వ్యక్తి అక్కడే కారును వదిలేసి పారిపోయినట్లు వారు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఎస్సై గురుస్వామిని వివరణ కోరగా వివరాలు తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.
Next Story