KTM: ఈ 2 బైక్‌లకు బ్రేక్ వేసిన KTM... రీజన్‌ తెలుసుకుంటే షాకే

by Vennela |
KTM: ఈ 2 బైక్‌లకు బ్రేక్ వేసిన KTM... రీజన్‌ తెలుసుకుంటే షాకే
X

దిశ, వెబ్ డెస్క్: KTM: భారత్ లో కేటీఎం బైక్ లవర్స్ కు బిగ్ షాక్. కేటీఎం తన కంపెనీకి చెందిన రెండు బైకుల అమ్మకాలను నిలిపివేసింది. RC 125, RC 200 బైక్‌లకు డిమాండ్ గణనీయంగా తగ్గడంతో వాటి అమ్మకాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. జనవరిలో కేవలం 17 యూనిట్లు మాత్రమే అమ్ముడైన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది కంపెనీ. త్వరలో కొత్త మోడళ్లతో తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు KTM RC సిరీస్ అభిమాని అయితే భవిష్యత్తులో మీకు శుభవార్త వినిపించవచ్చు. భారతదేశంలో RC 125, RC 200 మోడళ్ల అమ్మకాలను KTM నిలిపివేసింది. ఈ రెండు బైక్‌లు స్పోర్ట్స్ బైక్ ప్రియులలో బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఇటీవలి నెలల్లో వాటి డిమాండ్ నిరంతరం తగ్గుతోంది.

KTM RC 125, RC 200 అమ్మకాలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి.

-ఈ బైక్‌ల ధర దాదాపు రూ. 1.89 లక్షలు (RC 125), రూ. 2.17 లక్షలు (RC 200) ఉండగా ఇది ప్రజల బడ్జెట్‌కు మించిపోయింది.

-Yamaha R15, Suzuki Gixxer SF, TVS Apache RR 310 వంటి బైక్‌లు ఈ ధరల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. ఇవి కస్టమర్లకు మరిన్ని ఫీచర్లు, మెరుగైన విలువను అందిస్తున్నాయి.

-KTM రాబోయే కొత్త తరం బైక్‌ల కోసం చాలా మంది కస్టమర్లు ఎదురు చూస్తున్నారు. దీని కారణంగా పాత మోడళ్ల అమ్మకాలు మందగించాయి. KTM డ్యూక్ సిరీస్ వంటి స్పోర్ట్స్ బైక్‌ల కంటే ప్రజలు అడ్వెంచర్ , స్ట్రీట్‌ఫైటర్ బైక్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

అయితే KTM ఇంకా అధికారికంగా కొత్త బైక్‌లను ప్రకటించలేదు. కానీ కంపెనీ త్వరలో కొత్త తరం RC సిరీస్‌ను పరిచయం చేయనుంది. కొత్త బైక్‌లు మెరుగైన ఫీచర్లు, కొత్త డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ఇంజిన్‌లతో మార్కెట్లోకి లాంచ్ అవకాశం ఉంది.

Next Story

Most Viewed