- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tirumala:‘మరీ ఇంత దారుణమా’.. శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం.. అసలు విషయమేంటంటే?

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వెళుతుంటారు. శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు(devotees) విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారు. అయితే తిరుమలలోని కళ్యాణకట్టలో నిలువు దోపిడీ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
తిరుమలలోని కళ్యాణకట్టలో భక్తుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. భక్తులకు గుండు చేయాలంటే(తలనీలాలు) రూ.100 ఇవ్వాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. తలనీలాలు తీసేందుకు ఓ మహిళా ఉద్యోగి భక్తుడిని వంద రూపాయలు అడుగుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన భక్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పై శ్రీవారి భక్తులు స్పందిస్తూ.. తాము కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.