చేదు జ్ఞాపకాలు తొలగించే టెక్నిక్..ఇక అన్ని హ్యాపీ డే... ఎలాగో తెలుసా ?

by Veldandi saikiran |
చేదు జ్ఞాపకాలు తొలగించే టెక్నిక్..ఇక అన్ని హ్యాపీ డే... ఎలాగో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : సైంటిస్టులు ( Scientists ) మరో ప్రయోగాన్ని విజయవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మనిషి చేదు జ్ఞాపకాలను, నెగిటివ్ ఆలోచనలను, పాత జ్ఞాపకాలు ( Bad memories ) మైండ్ నుంచి తొలగిపోయేలా... కొత్త టెక్నిక్ డెవలప్ చేస్తున్నారు. దాదాపు ఈ కొత్త టెక్నిక్ దశకు వచ్చిందని సైంటిస్టులు ప్రకటన చేశారు. మెమొరీ రి ప్రోగ్రామింగ్ టెక్నిక్ ( memory-reprogramming technique) పేరుతో... సైంటిస్టులు ఈ ప్రయోగాలను చేస్తున్నారు. మనిషి జీవితంలో... బాధలతో పాటు సంతోషాలు కూడా ఉంటాయి. మనిషి సంతోషంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడు.


ఒక మనిషి పాత జ్ఞాపకాలు, అతనికి జరిగిన అవమానాలు, నష్టాలు, నెగిటివ్ ఆలోచనలు ( Negative thoughts )లాంటిది మనిషి మెదడులో విపరీతంగా మెదిలితే... చాలా ప్రమాదం. పడుకున్నా, తింటున్న, ఆఫీస్ కు వెళ్లిన, బయటకు వెళ్లినా ఆ నెగిటివ్ ఆలోచనలే... నిత్యం గుర్తుకు వస్తుంటాయి. దీనివల్ల మనిషి పూర్తిగా డిస్టర్బ్ అయి...సు***సైడ్ వరకు వెళ్తాడు. అయితే అలాంటి ప్రమాదాలు జరగకుండా... మెమొరీ ప్రోగ్రామింగ్ టెక్నిక్ పేరుతో.. సైంటిస్టులు కొత్త ప్రయోగాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రోగ్రాం ద్వారా చెడు ఆలోచనలను, చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు అన్ని తొలగిపోతాయి.

దీనిపై మరింత లోతుగా శోధన చేస్తున్నారు సైంటిస్టులు. ఒకవేళ దీని మార్కెట్లోకి తీసుకు వస్తే.. మనిషి జీవితానికి అన్ని హ్యాపీ డేస్ ( Happy Days ) అని చెప్పవచ్చు. ఈ టెక్నిక్ ఉంటే.. నిత్యం మనిషి.. హ్యాపీగా జీవిస్తాడు. నెగిటివ్ ఆలోచనలు అస్సలు రావు. చాలా పాజిటివ్ గా ఉంటాడు. పడుకున్నా లేదా ఏదైనా పని పైన ఉన్నా... రిలాక్స్ గా ఉంటూ.. జీవితాన్ని గడిపే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ టెక్నిక్ పై జనాలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. నెగిటివ్ ఆలోచనలు తొలగిస్తే చాలా మంచిదని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed