22 లక్షల టన్నుల యూరియా.. కేంద్రానికి, కేంద్రమంత్రికి ధన్యవాదాలు: మంత్రి అచ్చెన్నాయుడు

by Mahesh |
22 లక్షల టన్నుల యూరియా.. కేంద్రానికి, కేంద్రమంత్రికి ధన్యవాదాలు: మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రబీ సీజన్(Rabi season) లో అత్యధికంగా పంటలు వేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం(Central Govt).. రబీ సీజన్‌కు 22 లక్షల టన్నుల యూరియా(Urea) పంపాలని వ్యవసాయ శాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు యూరియా, ఎరువులు రాష్ట్రానికి చేరుకున్నాయి. దీనిపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు(Minister Achennaidu) స్పందించారు. "రబీ సీజన్‌కు సంబంధించి యూరియా, ఎరువులు రాష్ట్రానికి వచ్చాయి. కేంద్రం నుంచి 22 లక్షల టన్నుల యూరియా పంపడంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు(Union Minister Ram Mohan Naidu) చొరవ ఎంతగానో ఉంది. కోరిన వెంటనే రాష్ట్రానికి యూరియా, ఎరువులు పంపిన కేంద్రానికి, కేంద్రమంత్రికి ధన్యవాదాలు అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed