నిమ్స్ హాస్పిటల్ లో పలువురిని పరామర్శించిన మంత్రి జూపల్లి..

by Sumithra |
నిమ్స్ హాస్పిటల్ లో పలువురిని పరామర్శించిన మంత్రి జూపల్లి..
X

దిశ, కొల్లాపూర్ / పెద్దకొత్తపల్లి : అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన పలువురిని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి ఆయన తెలుసుకున్నారు. కొల్లాపూర్ పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మాలల చైతన్య సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాందాసు రోడ్ ప్రమాదంలో గాయపడి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అదే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పెద్ద కొత్తపల్లి మండలం చిన్నకర్పాముల గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రాంరెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు.

Advertisement

Next Story

Most Viewed