- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ సారి తగ్గేదే లే..!
దిశ,కొత్తూరు: కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్లు.. హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ ….అంటూ ఈ సారి యువత స్థానిక సమరానికి సై అంటూ కాళ్లు దువ్వుతున్నారు. ఇంకా ఎన్నాళ్లు జెండాలు మోయాలి, బ్యానర్లు కట్టాలి..ఇంకా ఎన్ని రోజులు వీళ్లే ఊరిని ఏలుతారు...! మాకు ఒక అవకాశం కావాలి. లేకుంటే ఈ సారి ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం అంటూ తమ తమ బలాబలాను బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు. ఎలాగైనా ఈ సారి సర్పంచ్ సాబ్ అని పిలుపించుకోవాలని దాదాపు మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో పోటీ కోసం వేచి చూస్తున్న యువత ఎక్కడా తగ్గకుండా ఎన్ని లక్షలైనా సరే ఖర్చు చేయడానికి తగ్గేదేలే అని సవాళ్లు విసురుతున్నారు.
గ్రామలలో అన్నదానాలు,ప్రత్యేక కార్యక్రమాలు..
గ్రామానికి సర్పంచ్ కావాలని ఆలోచన ఉన్నవాళ్లు గ్రామంలోని వార్డులో ఎవరు బరిలో ఉంటే తనకు ఓట్లు పడతాయో వారిని గుర్తించి తమ వెంట తిప్పుకుంటున్నారు. అవసరమైతే వారికి ఆర్థికంగా సహాయం కూడా చేస్తున్నారు. వీలైనప్పుడు గ్రామాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమాలకు మండల స్థాయి నేతలను పిలిచి వారి దృష్టిలో పడేందుకు తిప్పలు పడుతున్నారు. ప్రతి చిన్న ఈవెంటుకు అన్నదానం చేసి ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కొందరు చివరి అస్త్రంగా కుల రాజకీయాలకు కూడా తెర లేపారు. ఓటరు ఏ పార్టీ వాడైనా సరే సర్పంచ్ రేసులో ప్రత్యర్థి అభ్యర్థి తమ కులం వాడు ఉంటే ఓటు వేసేలా మోటివేషన్ చేయడానికి ప్రత్యేక టీంలను గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నారని సమాచారం.
ప్రజలకు సేవ చేయడానికా.. లేక స్వలాభం కోసమా...?
స్థానిక స్వయం పరిపాలన అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. సర్పంచ్ అంటే గ్రామ నిర్ణయ రూపకర్తల పెద్ద. ఇలాంటి ఒక అత్యున్నతమైన సర్పంచ్ పదవిని యువత ఎందుకోసం కోరుకుంటుంది. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఎన్ని లక్షలైనా, కోట్లయినా ఖర్చు చేసేందుకు తగ్గేదేలే అని బహిరంగంగానే ఎందుకు చెప్పుకుంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అంటే యువత దృష్టిలో సర్పంచి పదవి అనేది బాధ్యతాయుతమైన పదవిలా కాకుండా తన పలుకుబడిని, పరపతిని పెంచుకోవడానికి ఒక ఆభరణంగా చూస్తున్నారా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా అని అందరిని ఒకేలా చూడలేము.
ఎన్నికల హడావిడి లేకముందు నుండే కొందరు గ్రామ అభివృద్ధి కోసం తమ వంతు సహాయంగా ఎంతో కొంత ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా యువత గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడి... డబ్బులు ఖర్చు చేసి గెలిచిన నాయకుడిగా కాకుండా స్వతహాగా ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా గెలిస్తే బాగుంటుందని సీనియర్ రాజకీయ నాయకులు వారికి సలహా ఇస్తున్నారు. డబ్బులు ఖర్చు చేయకుండా జనం మెచ్చిన నాయకుడిగా.. ప్రజా నాయకుడిగా గెలుపొందిన తర్వాత మంచి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని హితవు పలుకుతున్నారు.
పార్టీలకు తలనొప్పిగా యువ అభ్యర్థులు..
సర్పంచ్ ఎన్నికలలో పార్టీల గుర్తులతో ఎన్నికలు జరగనప్పటికీ తమ పార్టీల నుండి ఒక అభ్యర్థి పేరును ఫైనల్ చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి జరగబోయే ఎన్నికల్లో నేను పోటీ చేస్తా అంటే నేను పోటీ చేస్తా అని అభ్యర్థులే ఎవరికివారు చెప్పుకుంటూ తమ తమ బలాలను బహిరంగ రహస్యంగా ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు వీరిలో గెలుపు గుర్రాన్ని కనిపెట్టి పార్టీ తరఫున అభ్యర్థిని ఫైనల్ చేయడంలో పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. దీన్ని అడ్వాంటేజ్ గా ఇతర పార్టీలు తీసుకోవడానికి ఆస్కారం ఉందని సీనియర్ రాజకీయవేత్తలు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల సమరం రసవత్తరంగా మారడం ఖాయం.త్వరలోనే ఎన్నికలు రాబోతున్నవి రెడీగా ఉండండి.