ప్రసాదంలో బొద్ధింక

by Sridhar Babu |
ప్రసాదంలో బొద్ధింక
X

దిశ, తిరుమలగిరి : దేశంలో ప్రసిద్ధి చెందిన పలు దేవాలయాలలో సికింద్రాబాద్ తాడ్ బంద్ హనుమాన్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి శనివారం ఈ దేవాలయంలో భక్తుల సందడి అధికంగా ఉంటుంది. నూతన సంవత్సరం మొదటి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి హాజరై పూజలు నిర్వహించి, ఆలయంలో తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా దేవాలయంలో కొనుగోలు చేసిన ప్రసాదంలో ఓ భక్తుడికి బొద్దింక రావడంతో ఆలయ పరిసర ప్రాంగణం అంతా ఖంగుతింది. ప్రసాదంలో జరిగిన సమస్యను సంబంధిత ఈఓ కు భక్తుడు తెలియజేశారు. ప్రసాదంలో బొద్దింక వచ్చిందనే విషయం భక్తుడు సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృత ప్రచారం చేశాడు. అయితే ఈ ప్రసిద్ధి చెందిన హనుమాన్ దేవాలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలోకి రావడంతోనే ఇలాంటి అపశృతులు ఎదురవుతున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలను కాపాడి సరైన చర్యలు తీసుకోవాలని హనుమాన్ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

కావాలనే ప్రచారం చేస్తున్నారు : ఈఓ నరేందర్

శనివారం హనుమాన్ ఆలయంలో కొంతమందికి ప్రసాదాలు అమ్మిన వివరాలు ఉన్నాయి. నేను అంటే గిట్టని వారే ఎవరో ఈ కుట్రలు పన్నారు. ఆలయంలో 7 దద్దోజనం, 6 చక్కెర పొంగలి ప్రసాదాలు అమ్మినం. ప్రసాదంలో బొద్దింక వచ్చినట్లు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఈ విషయమై ఆలయంలో పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. అంతే కాకుండా ప్రసాదంలో బొద్ధింక అంటూ వైరల్ చేస్తున్న ఫొటోలో ఆలయానికి చెందిన కవర్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న కొంతమంది వ్యక్తుల అవినీతిని బయట పెడుతున్నందుకే నాపై ఈ కుట్రలు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed