- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిజిటల్ మీడియాలో "దిశ " ఓ దిక్సూచి..
దిశ, కుత్బుల్లాపూర్/ దుండిగల్ : నిజాలను నిర్భయంగా వెలికి తీస్తూ "దిశ" దినపత్రిక అనతి కాలంలోనే విశేష పాఠకుల ఆదరణ పొందిందని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. డిజిటల్ మీడియా రంగంలో దిక్చూచి లా నిలిచిందన్నారు. పాఠకుల ఆదరణ పొందుతున్న దిశ దిన పత్రిక 2025వ సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరంచడం ఆనందంగా ఉందని శంభిపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని శంభిపూర్ లోని తన కార్యాలయంలో ఎమ్యెల్సీ మేడ్చల్ జిల్లా దిశ దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ దినపత్రిక పాఠకులకు, ప్రకటన కర్తల మన్ననలు పొందుతూ పత్రిక రంగంలో సంచనాలు సృష్టిస్తుందన్నారు.
ముక్కు సూటి తత్వం, ఉన్నది ఉన్నట్లగా పాఠకులకు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దిశ పత్రిక మేడ్చల్ జిల్లా బ్యూరో చీఫ్ కల్లేపల్లి రవిచంద్ర, ఐజేయూ జాతీయ కౌన్సిల్ మెంబర్ రంగు వెంకటేష్ గౌడ్, కుత్బుల్లాపూర్ ఆర్ సీ ఇంచార్జ్ లింగ స్వామి, దుండిగల్ రిపోర్టర్ మద్దయ్య, దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ తుడుము పద్మారావు, బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి కార్పొరేటర్లు ఎం.సత్యనారాయణ, జగన్, మాజీ కార్పొరేటర్ జి.సురేష్ రెడ్డి కౌన్సిలర్లు అనంత స్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, శామీర్ పెట్ హన్మంత్ రావు, మేడ్చల్ మార్కెట్ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.