- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టికెట్ల ధరల పెంపు.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు షాక్ ఇచ్చిన కోర్టు
దిశ, వెబ్ డెస్క్: రిలీజ్‌కు ముంద గేమ్ ఛేంజర్(Game Changer), డాకు మహారాజ్(Daku Maharaj) సినిమాలకు హైకోర్టులో షాక్ తగలింది. సంక్రాంతి పండుగ సందర్భంగా గేమ్ చేంజర్, డాకు మహరాజ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కియ్యడంతో ప్రభుత్వం.. ఈ సినిమాల టికెట్ రేట్లను పెంచుకునేందుకు తాజాగా పర్మిషన్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై పలువురు హైకోర్టు(High Court) ఆశ్రయించారు. వారి పిటిషన్‌లో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు 14 రోజుల వరకు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు.
కాగా ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిపిన కోర్టు.. 10 రోజుల ధరల పెంపును పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సినిమాల కలెక్షన్ల పై తీవ్ర ప్రభావం పడనున్నట్లు విశ్లేషకులు చెబుతుండగా.. సాధారణ ప్రేక్షకులు మాత్రం కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), యువ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహరాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.