DG Soumya Mishra: 2024 సంవత్సరంలో తెలంగాణలో 41,138 మంది ఖైదీలు: డీజీ సౌమ్య మిశ్రా

by Prasad Jukanti |   ( Updated:2025-01-08 08:29:37.0  )
DG Soumya Mishra: 2024 సంవత్సరంలో తెలంగాణలో 41,138 మంది ఖైదీలు: డీజీ సౌమ్య మిశ్రా
X

దిశ, డైనమిక్ బ్యూరో/ సిటీ క్రైం: 2024 సంవత్సరంలో వివిధ కేసులలో జైలుకు వచ్చిన వారి సంఖ్య భారీగా పెరిగిందని, ఈ ఏడాదిలో 41,138 మంది ఖైదీలు ఉన్నారని జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా (Soumya Mishra IPAS) వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ లో ఆమె జైళ్ల వార్షిక నివేదికను (Jails Annual Report) విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 2024లో హత్య కేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు. 2024లో ఫోక్సో కేసులో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు జైళ్లలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో ఎన్ డీపీఎస్ కేసులో 5,999 మంది పురుషులు, 312 మంది మహిళలు జైళ్లలో ఉన్నట్లు వివరించారు. 2023 సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 31,428 మంది ఖైదీలు జైళ్లలో ఉండగా ఆ ఏడాది హత్య కేసుల్లో 2,501 మంది శిక్షఅనుభవించారని తెలిపారు. ఫోక్సో కేసుల్లో 2,846 మంది పురుషులు, 59 మంది మహిళలకు శిక్ష పడిందన్నారు. జైళ్లలో ఉన్న ఖైదీలలోవా 30 ఏళ్ల లోపువారు 12,132 మది పురుషులు, 359 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. జైళ్లశాఖను పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఖైదీలకు వేతనాలను సైతం మెరుగుపరిచామని తెలిపారు.

జైళ్లలో మూలాకత్‌ల ద్వారా 2 వేల మంది ఖైదీలను వారి కుటుంబాలతో మాట్లాడించి వారిలో సంతోషాన్ని నింపామని డీజీ సౌమ్య మిశ్రా చెప్పారు. ఈ ఏడాది ఒక్క ఆత్మహత్య, పరారీ సంఘటనలు కూడా జరగలేదన్నారు. ఖైదీల సమాచారాన్ని భద్రపర్చేందుకు ఆధార్ అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో జైళ్లను గ్రీన్ ప్రిజన్స్‌గా మార్చేందుకు సోలార్ పవర్ వాడాకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చామని వివరించారు. త్వరలో జైలు మ్యూజియంను ప్రారంభిస్తామని చెప్పారు. అల్లు అర్జున్ అంశంలో జైలు రూల్స్‌ను ఫాలో అయ్యామని సౌమ్య మిశ్రా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed