TTD : ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం : టీటీడీ

by Y. Venkata Narasimha Reddy |
TTD : ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం : టీటీడీ
X

దిశ, వెబ్ డెస్క్ : గత ప్రభుత్వ హయాంలో టీటీడీ(TTD)లో ప్రజా సంబంధాల అధికారిణిగా పని చేసిన నిష్కా బేగం ఇంటిపై ఈడీ దాడు(ED Attacks)లు చేసిందని, పెద్ద ఎత్తున నగలను స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలు పూర్తిగా అవాస్తవ(False News)మని టీటీడీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నిష్కా బేగం ఇంటిపై ఈడీ దాడులలో భారీగా నగలను స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయనని, ఆ ఫోటోలకు సంబంధించిన వార్త పూర్తిగా అవాస్తవమని టీటీడీ ప్రకటించింది.

ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ హెచ్చరించింది. టీటీడీలో అటువంటి వ్యక్తి ప్రజా సంబంధాల అధికారిగా ఎప్పుడూ లేరని తెలిపింది. అంతే కాకుండా సదరు ఎక్స్ పోస్టులో గతంలో ఎక్కడో జరిగిన ఫోటోలను జతపరచి టీటీడీ పేరును వాడడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. భక్తులను తప్పుదోవ పట్టించి వారి మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఇటువంటి అవాస్తవ వార్తలు ప్రచారం చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటుందని టీటీడీ మరొకసారి హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed