రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు : జిల్లా కలెక్టర్

by Kalyani |
రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు : జిల్లా కలెక్టర్
X

దిశ, ఖైరతాబాద్ : రేపటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 6వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ఓల్డ్ సిటీ మెట్రో రైలు భూ నిర్వాసితులకు మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రేపు నిర్వహించవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed