Manipur : మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌పై దాడి

by Sathputhe Rajesh |
Manipur : మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌పై దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కంగ్‌పోక్పి నుంచి భద్రతా బలగాలు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆందోళన కారులు 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు శుక్రవారం డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో కుకీ, గిరిజనులు అధికంగా ఉండే కంగ్‌పోక్పిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ చోటుట చేసుకుంది. ఆందోళనకారులు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. మణిపూర్‌లో మైతీ, కుకీల మధ్య షెడ్యూల్ ట్రైబ్ హోదా విషయంలో వివాదం 2023 మే 3 నుంచి అల్లర్లుగా మారాయి. ఇప్పటి వరకు ఈ అలర్లలో 200 మందికి పైగా మరణించగా వేల మంది ఇతర ప్రదేశాలకు వలస వెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed