- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Canada: పీఆర్ అప్లికేషన్స్‌కు బ్రేక్ .. కెనడా మరో కీలక నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో పర్మినెంట్ రెసిడెన్స్ (PR) కొత్త దరఖాస్తులను నిలిపి వేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ‘ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ అండ్ సిటిజన్‌షిప్ కెనడా’ (IRCC) ఓ ప్రకటన విడుదల చేసింది. 2024లో సమర్పించిన ‘పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ప్రోగ్రామ్’ (PGP) అప్లికేషన్‌లను మాత్రమే ప్రాసెస్ చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది 15,000 దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో తమ తల్లిదండ్రులతో కెనడాలో శాశ్వతంగా జీవించాలని భావించే భారతీయులకు భారీ షాక్ తగలనుంది. కెనడా ప్రభుత్వం 2025 నాటికి శాశ్వత నివాసితుల సంఖ్యను 20శాతం తగ్గించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్లికేషన్స్ రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఈఏడాది పీజీపీ కింద 24,500 మందికి మాత్రమే పీఆర్ ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా, కెనడాకు చదువుకోవడానికి లేదా ఉద్యోగానికి వెళ్లే ఇండియన్స్ కొంతకాలం తర్వాత పీఆర్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. దీని ద్వారా అక్కడికి వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు, వారి తాతామామలు కెనడాలో పర్మినెంట్ నివాసం పొందొచ్చు. కెనడాలో పీఆర్ పొందడంలో భారతీయులు ముందంజలో ఉండటం గమనార్హం.