- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శేరిలింగంపల్లి జోన్ లో మేయర్ ఆకస్మిక పర్యటన..
దిశ, శేరిలింగంపల్లి : ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైనే చెత్త, దుర్గంధ భరితంగా మారిన డ్రైనేజీ, కనీసం రోడ్లు కూడా పరిశుభ్రంగా లేకపోవడం పట్ల మేయర్ గద్వాల విజయలక్ష్మి రాంకీ ప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డితో కలిసి చందానగర్ సర్కిల్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. పలు కాలనీలలో రోజుల తరబడి పేరుకుపోయిన చెత్త కుప్పలు, దుర్గంధ భరితంగా మారిన డ్రైనేజీలు, కనీసం రోడ్లు కూడా పరిశుభ్రంగా లేకపోవడం పట్ల మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి చెత్త పేరుకుపోయినా రాంకీ వారు వాటిని తొలగించక పోవడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు.
ఇటు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులు కూడా పారిశుద్ధ్య పనుల పై కనీస దృష్టి పెట్టక పోవడం ఏంటని ప్రశ్నించారు. పారిశుద్ధ్య పనుల కోసం కోట్లాది రూపాయల వెచ్చించి రాంకీ సంస్థకు పనులు అప్పగిస్తే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని నిలదీశారు. మియాపూర్, చందానగర్ పరిధిలో ఇంతలా పారిశుద్ధ్యం పడకేస్తున్నా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, డీసీలు ఏం చేస్తున్నారు.. పని చేయనప్పుడు ఇంత సిబ్బంది ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మెన్ సైతం పారిశుద్ధ్య పనుల నిర్వహణ పట్ల తీవ్రంగా మండిపడ్డారు. ఓ వైపు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, తాము తీవ్రంగా కృషి చేస్తుంటే అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. రాంకీ వారు ఏం చేస్తున్నారు.. వారు కాలనీలను శుభ్రంగా ఉంచుతున్నారా.. చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారా అనేది కూడా పరవేక్షించక పోతే సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు ఇంకేం చేస్తున్నారని మండిపడ్డారు.
డీసీలు, జోనల్ కమిషనర్ వీటిపై తరచూ దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పలు సమస్యలను మేయర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మియాపూర్ చెరువులో వ్యర్థాలను తొలగించక పోవడంతో రాంకీ సంస్థ నిర్వాహకులపై మేయర్ సీరియస్ అయ్యారు. శానిటేషన్ నిర్వహణ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మేయర్.. శానిటేషన్ మెరుగు పరచాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. మియాపూర్, చందానగర్ డివిజన్లలో జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించిన మేయర్, ఎమ్మెల్యే త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.