చందా అడిగితే బయటకు గెంటేశారని ఆందోళన

by Sridhar Babu |
చందా అడిగితే బయటకు గెంటేశారని ఆందోళన
X

దిశ, జగిత్యాల టౌన్ : జిల్లా కేంద్రంలోని జంబిగద్దె సమీపంలో ఉన్న జగిత్యాల కంటి ఆసుపత్రి ఎదుట శుక్రవారం మైనార్టీ యువకులు ఆందోళనకు దిగారు. మజీద్ చందా కోసం వచ్చిన మదర్సా నిర్వాహకుడు మహమ్మద్ అబ్దుల్ రహమాన్ పై ఆస్పత్రి నిర్వాహకుని సోదరుడు దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపించారు. చందా ఇవ్వమని అడిగితే బూతులు తిట్టి, మెడ పట్టి బయటకు గెంటి వేశారని ఆవేదన చెందారు. డాక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మైనారిటీ యువకుల ఆందోళనతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డాక్టర్ సోదరుడు సారీ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Advertisement

Next Story