దేవాలయాల్లో ఎమ్ చేయాలో అధికారులు నిర్ణయించాల్సిన అవసరం లేదు: చిన్న జీయర్ స్వామి

by Mahesh |
దేవాలయాల్లో ఎమ్ చేయాలో అధికారులు నిర్ణయించాల్సిన అవసరం లేదు: చిన్న జీయర్ స్వామి
X

దిశ, వెబ్‌డెస్క్: హిందు దేశాలయాల్లో ఏ పద్దతులు పాటించాల్లో.. ఉద్యోగం చేసే అధికారులు నిర్ణయించాల్సిన అవసరం లేదని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి(Chinna Jeeyar Swamy) చెప్పుకొచ్చారు. ఈ రోజు విజయవాడ(Vijayawada) వేదికగా విశ్వహిందూ పరిషత్(Vishwa Hindu Parishad) ఆధ్వర్యంలో జరిగిన హైందవ శంఖారావం(Hindava Sankharavam) బహిరంగ సభ(Public meeting)కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అధికారుల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. మనం కట్టుకున్న గుడిపై.. ప్రభుత్వ పెత్తనం ఎందుకని మండిపడ్డారు. అలాగే ప్రతి ఆలయానికి ఉన్న ఆస్తులు, హుండీ ఆదాయం తరిగిపోతుందని, ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే అని గుర్తు చేశారు. అలాగే ఇప్పటి వరకు ఆక్రమనకు గురైన ఆస్తులు, సంపదను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అలాగే దేవాలయాల్లో ఉండే పెద్దలు, పురోహితులు నిర్దేశించిన కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని, ఎవరో ఉద్యోగం చేసుకునేందుకు వచ్చిన అధికారులు ఆలయ పూజలు, నియమాలు, ఇతర నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అలాగే ఎండోమెంట్ లో ఉన్న అధికారులు భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వీఐపీ దర్శనాల పేరుతో భక్తులను ఇబ్బంది పెట్టి.. మత మార్పిడులకు కారణం అవుతున్నారని అన్నారు. అలాగే అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల ఎకరాలను ఆలయాలు కోల్పోయాయని గుర్తు చేశారు. వాటిని తిరిగి వెనక్కి తీసుకొస్తే..ఆలయాలకు భారీ సంపద వచ్చి చేరుతుందని.. దీంతో ఎవరు ఆలయాల్లో పైసలు చెల్లించకుండా దర్శనాలు చేసుకొవచ్చని తెలిపారు. అలాగే హైందవ శంఖారావానికి వచ్చిన ప్రతి పౌరుడు కీలక సందేశాన్ని తమ ప్రాంతాలకు తీసుకెళ్లాలని కోరారు. అలాగే ఈ రోజు హిందూ సంఘాలు అన్ని కలిసి తీసుకునే నిర్ణయాన్ని గ్రామాల్లో అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన చిన్న జీయార్ స్వామి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed