- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TG High Court: కేటీఆర్‌కు ఊహించని షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-కారు రేసింగ్ (Formula E-Car Racing) కేసులో తనపై ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇవాళ మరోసారి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తుది తీర్పును వెలువరించింది. ఈ మేరకు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. అయితే, తీర్పును వెల్లడిస్తున్న క్రమంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని ఆయన తరుఫు అడ్వొకేట్ కొరగా.. ఇలాంటి పిటిషన్లలో అవన్ని కుదరవని బెంచ్ స్పష్టం చేసింది. తాము ఏసీబీని అరెస్ట్ చేయొద్దని చెప్పలేమని స్పష్టం చేసింది. కేసు విషయంలో ఏసీబీ వాదనలను తాము సీరియస్‌గా పరిగణలోకి తీసుకున్నామని కోర్టు తెలిపింది.
పోటాపోటీగా వాదనలు ఇలా..
ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసులో కేటీఆర్ (KTR) తరఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే (Siddharth Dave) తన వాదనలు వినిపించారు. అయితే, కేటీఆర్ (KTR)కు సెక్షన్ 409 ఏమాత్రం వర్తించదని ఆయన కోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ-కారు రేసింగ్ వ్యవహారంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని అన్నారు. సొంత ప్రయోజనాలకు కూడా ఆ డబ్బులను కేటీఆర్ వాడుకోలేదని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తన క్లయింట్‌కి ఒక్క రూపాయి రాలేదని ధర్మాసనానికి విన్నవించారు. ఒకవేళ కేటీఆర్‌కు 409 అప్లై చేస్తే దేశంలో గందరగోళం నెలకొనే ఛాన్స్ ఉందని వాదించారు. దేశంలో ఇకపై ఏ మంత్రి కూడా ఫైల్ మీద సంతకాలు చేయబోరని పేర్కొన్నారు. అందుకు సంబంధించి బాంబే హైకోర్టు (Bombay High Court) నుంచి ఇప్పటి వరకు అన్నీ కేసుల ఉదాహరణలు తాను కోర్టుకు అందజేయగలని అన్నారు. పర్మిషన్ తీసుకోలేదనే విషయానికి సెక్షన్ 405 వర్తించదని ధర్మాసనానికి తెలిపారు. కేటీఆర్ (KTR) ఓ మంత్రిగా నిర్ణయం తీసుకున్నారని, బ్యాంకింగ్ చానల్స్ ద్వారానే నిధులు ఆర్గనైజింగ్ టీంకు నిధులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని అన్నారు. ఏసీబీ (ACB) అధికారులు చెబుతోన్న రూ.8 కోట్లు కూడా కేటీఆర్ (KTR) ఖాతాలోకి వెళ్లవని.. ఆ డబ్బు కూడా నిర్వాహకులకే వెళ్తుందని సిద్ధార్థ్ దవే తన వాదనలు వినిపించారు.
పూర్తి ఆధారాలు కోర్టుకు
మరోవైపు ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ బాలమోహన్ రెడ్డి తమ వాదనలను బలంగా వినిపించారు. ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు ద్వారా అధికారుల విదేశీ సంస్థకు జరిగిన లావాదేవీల డాక్యుమెంట్లు, ఫార్ములా ఈ-రేసు నిర్వహణకు సంబంధించి నోట్ ఫైళ్లు, ఇతర సాక్షాధాలను ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. కేబినెట్‌లో చర్చించకుండానే ఏకపక్షంగా కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారని ధర్మాసనానికి బాలమోహన్ రెడ్డి విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తుది తీర్పును వెలువరించింది.