- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో పెరిగిన చలి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో చలి వాతావరణం మరో సారి పెరిగింది. నిన్న, ఈ రోజు, రేపు మూడు రోజుల వరకు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుందని, దీని కారణంగా ఈ మూడు రోజులు కూడా రాత్రి ఉష్ణోగ్రతలు మళ్లీ 6 డిగ్రీలకు చేరుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగ రాబోయే 3 రోజులు రాష్ట్రంలో ఆదిలాబాద్ , కొమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాతో పాటు మరి కొన్ని జిల్లాల్లో అత్యల్పంగానే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వెల్లడించింది. ఫలితంగా అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. పొగమంచు నేపథ్యంలో ఈ 3 రోజులలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న ఆదివారం నాడు ఆదిలాబాద్ నిర్మల్తదితర జిల్లాల్లో అక్కడక్కడ శీతలగాలుల పరిస్థితులు ఏర్పడినట్టు వెల్లడించింది. ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీస్తాయని తెలిపింది.