Bhatti Vikramarka: ధైర్యంగా వెళ్లండి.. కాంగ్రెస్ నాయకులకు డిప్యూటీ సీఎం భట్టి సూచన

by Prasad Jukanti |
Bhatti Vikramarka: ధైర్యంగా వెళ్లండి.. కాంగ్రెస్ నాయకులకు డిప్యూటీ సీఎం భట్టి సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఏడాది కాలంలో రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేసిందని, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీని నిలబెట్టుకున్న ఘనత తమదేనని అన్నారు. ఇవాళ ఆయన వరంగల్ (Warangal) మహానగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్ లో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి మొగిలి చెర్లలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అబద్ధాలతో పదేళ్లు మోసం చేసిందని, కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి రూ.లక్ష రుణమాఫీ చేయనివాళ్లు కూడా నేడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తాము ఏడాదిలో గ్రూప్ -1 పరీక్ష నిర్వహించడంతోపాటు వివిధ శాఖల్లో మొత్తం 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తామని పార్టీకి ఓట్లువేయించింది నాయకులేనని అలాంటి నాయకులు ఇప్పుడు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వాస్తవాలను వివరించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed