- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Dallewal: అలా అయితే దల్లెవాల్ వైద్య సహాయానికి అంగీకరించొచ్చు.. పంజాబ్ ప్రభుత్వం
దిశ, నేషనల్ బ్యూరో: రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ (Panja) హర్యానా (Haryana) బార్డర్‌లోని ఖనౌరీ సరిహద్దులో రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ (Dallewal) ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం 36వ రోజూ కొనసాగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. అయితే రైతులతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైతే దల్లేవాల్ వైద్య సహాయం తీసుకోవడానికి అంగీకరించొచ్చని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మరికొంత సమయం కేటాయిస్తే ప్రతిష్టంభన ముగిసిపోవచ్చని పంజాబ్ అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన వెకేషన్ బెంచ్‌కు తెలియజేశారు. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నందున డిసెంబర్ 31 లోపు దల్లేవాల్‌ను ఆస్పత్రికి తరలించాలని పంజాబ్ రాష్ట్రాన్ని అత్యున్నత న్యాయస్థానం గతంలో ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే తమకు మరింత సమయం కావాలని గుర్మీందర్ కోర్టును అభ్యర్థించారు. రైతులను కలవడానికి తమ ప్రతినిధులు వెళ్లారని, వారిని ఒప్పించే ప్రయత్నం చేశారని తెలిపారు. దల్లేవాల్‌ను ఖానౌరీ సరిహద్దులోని పంజాబ్ వైపున సమీపంలోని తాత్కాలిక ఆస్పత్రికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. వాదనలు విన్న బెంచ్ దల్లేవాల్‌కు చికిత్స అందించడానికి ప్రభుత్వానికి మరికొంత టైం ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 2కు వాయిదా వేసింది.
చర్చలకు సిద్ధమైతేనే దీక్ష విరమణ: రైతు సంఘాలు
కేంద్రం చర్చలకు సిద్ధమైతేనే దల్లేవాల్ తన దీక్ష విరమించే అవకాశం ఉందని రైతు నాయకులు అభిమన్యు కోహర్, కాకా సింగ్ కొట్రా, సూర్జిత్ సింగ్ ఫూల్‌లు తెలిపారు. సుప్రీంకోర్టులో జరిగిన మొత్తం ప్రక్రియను గమనించామని, గతంతో పోలిస్తే కోర్టు వైఖరి మారిందని తెలిపారు. డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే, దల్లేవాల్ తన నిరాహార దీక్షను విరమించే అంశాన్ని పరిశీలించొచ్చని సూచించారు. రైతుల డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మార్గదర్శకాలను విడుదల చేయాలని కోరారు.