- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
DGP: టీజీఎస్పీ పోలీసులు అంతర్జాతీయంగా రాణించాలి.. తెలంగాణ డీజీపీ జితేందర్
దిశ, తెలంగాణ బ్యూరో: నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇచ్చేందుకు టీజీఎస్పీ విభాగంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు , ఈ అవకాశాన్ని వినియోగించుకుని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా రాణించాలని డీజీపీ జితేందర్(DGP Jithendar) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్‌పీ(TGSP) బెటాలియన్లలో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ మొదటి బెటాలియన్ లో డీజీపీ డాక్టర్ జితేందర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్, క్రికెట్ క్రీడలలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని చాటి చెప్పిన బాక్సర్ నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ క్రికెటర్ లు ప్రస్తుతం టీజీఎస్పీ డీఎస్పీలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని గుర్తు చేశారు. వారి ఆధ్వర్యంలో నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇచ్చేందుకు టీజీఎస్పీ లో బాక్సింగ్, క్రికెట్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీజీఎస్పీ సిబ్బందికి శాంతి భద్రతల పరిరక్షణలోనూ, ఇతర రాష్ట్రాలలో సేవలు అందించింనదుకు వారికి ఎంతో పేరు ఉందని అన్నారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న టీజీఎస్పీ సిబ్బందిని మాదకద్రవ్యాల ను అరికట్టేందుకు, సైబర్ నేరాలను నియంత్రించేందుకు కూడా వినియోగిస్తామన్నారు. జీఆర్పీ, సీఐడీ విభాగాలలోను వీరి సేవలు ఉపయోగించుకుంటామన్నారు. టీజీఎస్పీ అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న 4077 కానిస్టేబుల్ లలో 2746 గ్రాడ్యుయేట్స్ , 596 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 62 మంది ఎక్స్ సర్వీస్ మెన్లు ఉన్నారని తెలిపారు. కమాండెంట్ మురళి కృష్ణ, మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
బెటాలియన్లలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీజీఎస్పీ బెటాలియన్లలో శుక్రవారం నాడు పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాలు జరిగాయి. టీఎస్పీ 3వ బెటాలియన్ లో ఇంటెలిజెన్స్ డీజీపీ బి శివధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కాగా, 4వ బెటాలియన్ లో ఏసీబీ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ జోషి , 7వ బెటాలియన్ లో నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సిహెచ్ సింధు శర్మ, టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్, 10వ బెటాలియన్ లో ఐజీపీ వి. సత్యనారాయణ, 12వ బెటాలియన్ లో ఐజీపీ ఎం. రమేష్, 13వ బెటాలియన్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, 15వ బెటాలియన్ లో ఖమ్మం సీపీ సునీల్ దత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.