బైకును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు…వ్యక్తి మృతి

by Kalyani |
బైకును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు…వ్యక్తి  మృతి
X

దిశ, నందిగామ: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన.. నందిగామ మండలం లోని చంద్రాయన్ గూడ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పరుక్ నగర్ మండలం పీర్ల గూడెం గ్రామానికి చెందిన గుంటి నర్సింలు(60) శుక్రవారం సాయంత్రం నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో ఓ ఫంక్షన్కు వచ్చి తిరుగు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా ప్రయాణంలో చంద్రయాన్ గూడ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగ చికిత్స నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతి ని కొడుకు లింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed