TG: విద్యా కమిషన్ మీటింగ్‌లో పేరెంట్స్ కీలక డిమాండ్

by Gantepaka Srikanth |
TG: విద్యా కమిషన్ మీటింగ్‌లో పేరెంట్స్ కీలక డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని పేరెంట్స్ విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ స్కూళ్లు భారీగా వసూలు చేస్తున్నాయని, అలా జరగకుండా చూడాలని విద్యా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల విద్యా డైరెక్టరేట్ కార్యాలయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో కమిషన్ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ స్కూళ్లలో ఫీజుల పరిస్థితి, ఫెసిలిటీస్ గురించి పేరెంట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రొఫెషనల్ కాలేజీల్లో మాదిరిగా మూడేండ్లకు లాక్ పీరియడ్ పెట్టాలని కోరారు. దీంతో పాటు ప్రభుత్వం ఏం చేస్తే పేరెంట్స్‌కు లాభం జరుగుతుందనే వివరాలను వారి నుంచి సేకరించారు. ప్రతి జిల్లా స్థాయిలో ఫీజు రెగ్యులేటరీ కమిటీలు ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కోరారు.

స్కూళ్లలో ప్రతిఏటా 10 నుంచి 15 శాతం వరకు ఫీజులు పెంచుతున్నారని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. స్కూల్ మారాలంటే డిసెంబర్ లోనే టీసీలు తీసుకుపోవాలని మేనేజ్ మెంట్లు చెబుతున్నాయని పేరెంట్స్ వివరించారు. ఆ తర్వాత తీసుకుంటే ముందస్తు ఏడాది ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని కమిషన్ ఎదుట పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. బడుల్లో యూనిఫామ్స్, బుక్స్ అమ్మొద్దని ఆదేశాలు ఉన్నా.. మేనేజ్మెంట్లు మాత్రం మార్కెట్ రేట్ కంటే 50 శాతానికి పైగా రేట్లు పెంచి బలవంతంగా అంటగడుతున్నారని వివరించారు. మరి దీనిపై విద్యా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed