బెల్ట్ షాప్ ల మధ్య ఘర్షణ..సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Kalyani |   ( Updated:2025-01-03 16:57:13.0  )
బెల్ట్ షాప్ ల మధ్య ఘర్షణ..సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ,సూర్యాపేట టౌన్ : రెండు బెల్ట్ దుకాణాల మధ్య పోటీతత్వం తీవ్ర ఘర్షణకు దారి తీసిన సంఘటన సూర్యాపేట మండలం గాంధీనగర్ లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం గాంధీనగర్ పెద్దమ్మతల్లి దేవాలయం సమీపంలో జక్కలి అంజమ్మ, బాలెంల నాగమ్మ కుటుంబాలు పక్కపక్కనే కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ.. అందులో మద్యం విక్రయిస్తున్నారు. వ్యాపార విషయంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంలో మంగళవారం రాత్రి ఇరువర్గాల కుటుంబ సభ్యులు ఘర్షణ పడ్డారు.

మరుసటి రోజు బుధవారం బాలెంల నాగమ్మతో పాటు మరో పదిమంది జక్కలి అంజమ్మ దుకాణంపై వెళ్లి ఆమెతో పాటు భర్త రమేష్ కుమారుడు విగ్నేష్ మరో ముగ్గురిపై దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరాలు నిక్షిప్తమైన ఈ దృశ్యాలు సామాజిక మద్యమాల్లో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా దాడికి పాల్పడిన వారిలో నోముల శివాని యువకులపై జక్కరి అంజమ్మ వర్గీయులు గురువారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో చరవాణిలో తీసిన దృశ్యాలు సామాజిక మద్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇరు వర్గాలకు గాయాలు ఆవ్వడం తో..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై బాలు నాయక్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed