Karnataka : డీఎస్పీ ఆఫీసులోనే మహిళను వేధించిన ఉన్నతాధికారి

by M.Rajitha |   ( Updated:2025-01-03 17:19:00.0  )
Karnataka : డీఎస్పీ ఆఫీసులోనే మహిళను వేధించిన ఉన్నతాధికారి
X

దిశ, వెబ్ డెస్క్ : ఉన్నతస్థాయి పోలీసు అధికారుల ఆఫీసులోనే ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైన ఘటన కర్ణాటక(Karnataka)లో చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా, అధికారులు చర్యలకు దిగారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. తుమకూరు జిల్లా పావగడకు చెందిన మహిళ భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు మధుగిరి డివిజన్‌లోని డీఎస్పీ ఆఫీసు(DSP Office)కి వెళ్లింది. అయితే డీఎస్పీ రామచంద్రప్ప(DSP RamaChandrappa) ఆమెను టాయిలెట్‌ వద్దకు తీసుకెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తించాడు. కాగా, రహస్యంగా రికార్డ్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్(Home Minister Parameshwer) సొంత జిల్లాలో ఈ సంఘటన జరుగడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఫిర్యాదు కోసం వచ్చిన మహిళను పోలీస్‌ అధికారి లైంగికంగా వేధించడంపై రాజకీయంగా దుమారం రేపింది. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ లీకైన నాటి నుంచి ఆ పోలీస్‌ అధికారి కనిపించడం లేదని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed