- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
WTC Final : సౌతాఫ్రికాతో తలపడేదెవరో?.. ఆ జట్టుకే అవకాశాలు ఎక్కువ.. భారత్ పరిస్థితి ఏంటి?
దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించింది. పాక్‌తో తొలి టెస్టులో విజయంతో ఏ అడ్డంకి లేకుండా సఫారీలు నేరుగా టైటిల్ పోరుకు క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మరో ఫైనలిస్ట్ ఎవరు? అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నది. ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. మరి, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవానికి ఏ ఏ జట్టుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం..
భారత్‌కు రెండు దారులు
నాలుగో టెస్టులో ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు మరింత సంక్లిష్టమయ్యాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ 3వ స్థానంలో ఉన్నది. తాజా ఓటమితో విన్నింగ్ శాతం 55.89 నుంచి 52.77కు పడిపోయింది. ఒక రకంగా ఫైనల్ బెర్త్ టీమిండియా చేతుల్లో లేదనే చెప్పాలి. అయితే, టైటిల్ పోరుకు అర్హత సాధించే దారులు ఇంకా మూసుకపోలేదు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో టీమిండియా కచ్చితంగా గెలవాలి. డబ్ల్యూటీసీ సర్కిల్‌లో భారత్‌కు అదే చివరి మ్యాచ్. ఓడినా, డ్రా చేసుకున్నా భారత్ ఆశలు గల్లంతైనట్టే. గెలిస్తే భారత్ విన్నింగ్ శాతం 55.26కు చేరుతుంది. అదే సమయంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో ఓడిపోవాలి. ఫైనల్‌కు చేరుకోవడానికి భారత్‌కు మరో దారి కూడా ఉంది. ఆఖరి టెస్టులో ఆసిస్‌పై నెగ్గాలి. అలాగే, శ్రీలంక, ఆసిస్ మధ్య రెండో టెస్టులు డ్ అవ్వాలి. అప్పుడు భారత్, ఆస్ట్రేలియా 55.26 శాతంతో సమంగా నిలుస్తాయి. ఎక్కువ సిరీస్ విజయాల కారణంగా టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆసిస్ మూడు మ్యాచ్‌ల్లో ఒక్క టెస్టులో నెగ్గినా భారత్ ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి, రోహిత్ సేన ఫైనల్‌కు చేరుకోవాలంటే అద్భుతమే జరగాలి.
ఆసిస్‌కే ఎక్కువ చాన్స్
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవడానికి ఆస్ట్రేలియాకే ఎక్కువ చాన్స్ ఉంది. నాలుగో టెస్టులో భారత్‌ను ఓడించడంతో ఆ జట్టు అవకాశాలను మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం కంగారుల జట్టు 61.6 శాతంతో రెండో స్థానంలో ఉన్నది. డబ్ల్యూటీసీ సర్కిల్‌లో ఆసిస్ ఇంకా మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌తో ఆఖరి టెస్టుతోపాటు శ్రీలంకతో రెండు టెస్టుల్లో తలపడనుంది. ఆసిస్ ఫైనల్‌కు చేరుకోవడానికి ఈ మూడు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కదాంట్లో నెగ్గినా సరిపోతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఫామ్‌ను చూస్తే మూడు టెస్టుల్లో ఒక్క దాంట్లో నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదు.
శ్రీలంక అద్భుతం చేస్తే..
భారత్, ఆస్ట్రేలియాతోపాటు రేసులో శ్రీలంక కూడా ఉంది. ప్రస్తుతం లంక జట్టు 45.45 శాతంతో 5వ స్థానంతో ఉన్నది. ఆ జట్టు అద్భుతం చేస్తే ఫైనల్‌లో సఫారీలను ఎదుర్కోవచ్చు. డబ్ల్యూటీసీ సర్కిల్ ఆ జట్టు చివరి రెండు టెస్టులను ఆస్ట్రేలియాతో తలపడనుంది. రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. అలాగే, భారత్, ఆసిస్ మధ్య ఆఖరి టెస్టు డ్రాగా ముగియాలి. అదే జరిగితే ఆస్ట్రేలియా 53.51 శాతంతో, భారత్ 51.75 శాతంతో నిలుస్తాయి. శ్రీలంక 53.85 మెరుగైన స్థితిలో నిలిచి ఫైనల్‌లో అడుగుపెడుతుంది.
- Tags
- #WTC final