న్యూ ఇయర్ రాత్రి భారీగా డ్రగ్స్ లభ్యం

by Bhoopathi Nagaiah |
న్యూ ఇయర్ రాత్రి భారీగా డ్రగ్స్ లభ్యం
X

దిశ, కార్వాన్ :న్యూ ఇయర్ వేళ అర్థరాత్రి భారీగా డ్రగ్స్ దొరికింది. పక్క సమాచారంతో డ్రగ్స్ స్మగ్లర్ ఇంటిపై దాడి చేసిన పోలీసులకు కొకైన్, ఎండీఎంఏ మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి.మాసబ్ ట్యాంకు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసు వివరాలను ఇన్స్పెక్టర్ పరుశురాం తెలిపారు.బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని అమృత వ్యాలీ అపార్ట్మెంట్ లో ఉంటున్న ఓ డ్రగ్స్ వ్యాపారిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించి 30 గ్రాముల కొకైన్, ఆరు గ్రాముల ఎండీఎంఏ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 8 లక్షల 25000 రూపాయలు ఉంటుందని సీఐ తెలిపారు. వ్యాపారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. టాస్క్ ఫోర్స్ టీం సహాయంతో ఈ దాడులు చేసినట్టు వెల్లడించారు. నగరంలోని మాదకద్రవ్యాల తన వ్యాపారాన్ని అరికట్టడానికి పోలీసులు చేసిన ప్రయత్నంలో ఇది పెద్ద విజయమని సీఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed