Viral News: స్టేషన్‌లోనే పోలీస్ చెంప చెళ్లుమనిపించిన వ్యక్తి.. ఎందుకంటే?

by Ramesh N |   ( Updated:2024-12-29 09:35:13.0  )
Viral News: స్టేషన్‌లోనే పోలీస్ చెంప చెళ్లుమనిపించిన వ్యక్తి.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లోనే పోలీస్ అధికారి చెంప చెళ్లుమనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది. మాండ్య జిల్లాలోని (Pandavapura town police station) పాండవపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో సివిల్ ప్రాపర్టీ వివాదానికి సంబంధించి సాగర్(32) అనే యువకుడిని శనివారం విచారణకు పిలిచారు. ఈ క్రమంలోనే అధికారి తనపై దురుసుగా ప్రవర్తించడనే కోపంతో పోలీస్ అధికారిని స్టేషన్‌లోనే చెంప పగలకొట్టాడు. పరస్పర చొక్కాలు పట్టుకొని.. ఘర్షణకు దిగడంతో పలువురు వీడియోలు రికార్డు చేశారు.

ఘటనపై ఎస్పీ మల్లికార్జున్ బాలదండి (Mallikarjun Baladandi) మాట్లాడుతూ.. ఆస్తి తగాదాలు సంబంధించిన కేసు.. వ్యవసాయ పొలంలో పని చేస్తున్న తమపై దాడి చేశాడని సాగర్ బంధువు ఆరోపించాడు. సాగర్‌ను స్టేషన్‌కు పిలిపిస్తే ఫిర్యాదు దారుడితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దాడికి పాల్పడ్డాడు. పోలీసు కానిస్టేబుళ్లు అభిషేక్, ఆనంద్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలోనే డ్యూటీలో ఉన్న మా కానిస్టేబుళ్లపై దాడికి దిగడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము.. అని వెల్లడించారు. ఈ క్రమంలోనే అతన్ని తాజాగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. సాగర్ అనే యువకుడు మాజీ మున్సిపల్ అధ్యక్షుడి కుమారుడు. అయితే పోలీసులలో ఒకరు సాగర్‌ను చెంపదెబ్బ కొట్టడంతో అతను అలా రియాక్ట్ అయ్యాడని ఆరోపణలు వచ్చాయి.

Advertisement

Next Story