Breaking: నకిలీ ఐపీఎస్ ప్రకాష్‌రావు అరెస్ట్.. రిమాండ్

by srinivas |
Breaking: నకిలీ ఐపీఎస్ ప్రకాష్‌రావు అరెస్ట్.. రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) పర్యటనలో హల్ చేసిన నకిలీ ఐపీఎస్ ప్రకాష్ రావు(Fake IPS Prakash Rao) చివరకు జైలు పాలయ్యాడు. ఐపీఎస్ డ్రెస్‌తో అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసుల ఆగ్రహానికి గురయ్యాడు. చివరకు జైల్లో కూర్చోని చువ్వలు లెక్కపెడుతున్నాడు. ఓవైపు పవన్ కల్యాణ్ పర్యటన ఉధృతంగా నడుస్తోంది. ఐపీఎస్ డ్రెస్‌లో ఉన్న ప్రకాష్ రావు అంతా తానే అనుట్టుగా వ్యవహరించారు. పవన్ భద్రత సిబ్బందితో పాటు రాజకీయ నేతలతో కలివిడిగా మాట్లాడుతూ ఫొటోలు దిగారు. పవన్ పర్యటన అయిపోయింది. ఎటు వాళ్లు అటు వెళ్లి పోయారు. కానీ ఫేక్ ఆఫీసర్ గుట్టు రట్టు అయింది. భద్రత సిబ్బందితో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీశారు. అనంతరం విచారణకు ఆదేశించారు. ప్రకాష్ రావు నకిలీ ఐపీఎస్ అని గుర్తించారు. ఈ ఘటనపై హోంమంత్రి సీరియస్ అయ్యారు. చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వెంటనే ప్రకాష్ రావును అరెస్ట్ చేసి సాలూరు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో ప్రకాష్ రావుకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ను పోలీసులు బొబ్బిలి జైలుకు తరలించారు.

Advertisement

Next Story