తిరుమల కొండపై సందడి చేసిన.. గోల్డ్ మ్యాన్

by Mahesh |
తిరుమల కొండపై సందడి చేసిన.. గోల్డ్ మ్యాన్
X

దిశ, తిరుమల: తులం బంగారం కొనాలంటే మనం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. అదే పది తులాలైతే నానా హైరానా పడుతుంటాం. రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం రేట్ల గురించి ఆరా తీస్తాం. అదే ఓ వ్యక్తి మెడలో ఐదు కిలోల పసిడి నగలు ధరించి కన్పిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే జరిగింది. తిరుమల శ్రీవారిని మంగళవారం బ్రేక్ దర్శన సమయంలో గోల్డ్ మ్యాన్ కొండ విజయకుమార్ దర్శించుకున్నారు. హోప్ ఫౌండేషన్ అధినేత అయిన ఆయన సుమారు ఐదు కిలోల బరువు, రూ. నాలుగు కోట్ల విలువ ఉన్న బంగారు నగలతో తిరుమలకు వచ్చారు. శ్రీవారి ఆలయం వెలుపల ఆయనతో సెల్ఫీ దిగడానికి జనం ఎగబడ్డారు.

Advertisement

Next Story

Most Viewed