Tirumala Samacharam: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

by Shiva |
Tirumala Samacharam: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. మంగళవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 2 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 2 కాంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం స్వామి వారిని 62,495 మంది దర్శించుకున్నారు. అందులో 19,298 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.2.55 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed