- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అధ్వానంగా పచ్చదనం !
వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన మొక్కలను లాంఛనంగా నాటారు. ఆపై వాటికి నీరు పోయకుండా గాలికొదిలేశారు. వర్షపు నీటితో కాస్త ఇగురు పెట్టినా... ఆ తర్వాత పట్టించుకునే వారు లేక ఎండిపోయాయి. పిచ్చిమొక్కల మధ్య పచ్చదనాన్ని పరిహసిస్తున్నాయి. వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారుల తీరును వెక్కిరిస్తున్నాయి. ఈ ఏడాది జూన్, ఆగస్టు మధ్య నగరంలో వనమహోత్సవం నిర్వహించారు. వివిధ రకాలకు చెందిన 2 వేల మొక్కలను రెడ్డిపాలెం, దేశాయిపేట డివైడర్లలో, అలాగే చిన్నవడ్డేపల్లి చెరువు కట్టపై నాటారు. ఇందుకు రూ.4.20 లక్షలు ఖర్చు చేశారు. మొక్కలు నాటే బాధ్యతను బల్దియా హార్టికల్చర్ విభాగం ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. కాగా, ఆ తర్వాత వాటి సంరక్షణను పట్టించుకున్న పరిస్థితులు కనిపించడం లేదు. ఒక్కరోజు కూడా నీళ్లు పోసిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. రూ.4.20 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లించినా కనీసం వాటికి ట్రీగార్డులు పెట్టకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దిశ, వరంగల్ టౌన్ : వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన మొక్కలను లాంఛనంగా నాటారు. ఆపై వాటికి నీరు పోయకుండా గాలికొదిలేశారు. వర్షపు నీటితో కాస్త ఇగురు పెట్టినా.. ఆ తర్వాత పట్టించుకునే వారు లేక ఎండిపోయాయి. పిచ్చి మొక్కల మధ్య పచ్చదనాన్ని పరిహసిస్తున్నాయి. వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారుల తీరును వెక్కిరిస్తున్నాయి.
రూ.4.20 లక్షలతో 2 వేల మొక్కలు !
ఈ ఏడాది జూన్, ఆగస్టు మధ్య నగరంలో వనమహోత్సవం నిర్వహించారు. వివిధ రకాలకు చెందిన 2వేల మొక్కలను రెడ్డిపాలెం, దేశాయిపేట డివైడర్లలో, అలాగే చిన్నవడ్డేపల్లి చెరువు కట్ట పై నాటారు. ఇందుకు రూ.4.20లక్షలు ఖర్చు చేశారు. మొక్కలు నాటే బాధ్యతను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించిన బల్దియా హార్టికల్చర్ విభాగం ఆ తర్వాత వాటి సంరక్షణను పట్టించుకున్న పరిస్థితులు కనిపించడం లేదు. ఒక్కరోజు కూడా నీళ్లు పోసిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు.
దేశాయిపేటలో అధ్వానం !
దేశాయిపేటలో సీకేఎం కాలేజీ నుంచి మార్కెట్ వెళ్లే రహదారిలో గల డివైడర్‌లో మొక్కలు నాటారు. ప్రస్తుతం డివైడర్‌లో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలే కనిపిస్తున్నాయి. కళ్లు పెద్దవి చేసి చూస్తే గానీ బల్దియా నాటిన మొక్కలు కనిపించే పరిస్థితి లేదు. మహరాజుల కాలనీ వైపు గల డివైడర్‌లో చెత్తాచెదారం కూడా పేరుకుపోయి అధ్వానంగా మారింది.
చిన్నవడ్డేపల్లి చెరువు కట్ట పై..!
చిన్నవడ్డేపల్లి చెరువు కట్ట పై కూడా మొక్కలు నాటారు. ఒకవైపు తాటి మొక్కలు మరోవైపు ఇతర మొక్కలు నాటారు. మొక్కలు వంగిపోతాయోమోనని వాటికి ఆనుగా కట్టిన వెదురు కట్టెలు కనిపిస్తున్నాయే తప్ప మొక్కలు కనిపించే పరిస్థితి లేదు. రూ.4.20లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లించినా కనీసం వాటికి ట్రీ గార్డులు పెట్టకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం మొక్కలకే అంత డబ్బు చెల్లించారా ? అదే నిజమైతే ఒక్కో మొక్కను ఎంతకు కొనుగోలు చేసి ఉంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.