- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
2024లో టౌన్ ప్లానింగ్ విభాగం ఆదాయం రూ.815.76 కోట్లు
దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను తర్వాత టీజీ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయడంతో ఆదాయం వస్తుంది. 2024లో ఇన్‌స్టాంట్ రిజిస్ట్రేషన్లు, అప్రూవల్స్ 10,176 ఉన్నాయి. సింగిల్ విండో ద్వారా ఆమోదించినవి 3,867 ఉన్నాయి. మొత్తం 14,043 అనుమతులు జారీ చేయడంతో జీహెచ్ఎంసీకి రూ.815.76 కోట్ల ఆదాయం వచ్చింది.
హెచ్-సిటీ ప్రాజెక్టులు..
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్ మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో చేపట్టనున్న 38 ప్రాజెక్టులు, 27 రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి కోసం భూసేకరణ చేయాలని ఆదేశించింది. దీంతో భూసేకరణ చేపట్టడానికి టౌన్ ప్లానింగ్ విభాగం రెడీ అవుతోంది. వచ్చే ఏడాది కాలంలో వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
90 జంక్షన్లు..
ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి, రోడ్లను విస్తరించడానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో రూ.233 కోట్లతో 90 జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 74 జంక్షన్లకు సంబంధించిన భూసేకరణ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. మరో 16 జంక్షన్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
కొత్త సంవత్సరంలో పనులు ప్రారంభం
గతేడాదిలో పట్టాలెక్కిన ప్రాజెక్టు పనులు కొత్త సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. జంక్షన్ల అభివృద్ధి వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. కేబీఆర్ పార్కు, ఆరు జంక్షన్లకు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.:- జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి