Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో బోరుబావిలో పడిన బాలుడు మృతి

by Shamantha N |
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో బోరుబావిలో పడిన బాలుడు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో బోరుబావి(borewell)లో పడిన పదేళ్ల బాలుడు చనిపోయాడు. గుణా ప్రాంతంలో బోరుబావిలో పడిన పదేళ్ల బాలుడ్ని కాపాడేందుకు 16 గంటల సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టారు. బాలుడ్ని బయటకు తీసిన వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. కాగా.. చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయినట్లు గుణా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్(Guna district chief medical and health officer) రాజ్ కుమార్ రిషీష్వర్ తెలిపారు. "రాత్రంతా చలి వాతావరణంలో పిల్లాడు ఇరుకైన బోర్‌వెల్‌లో ఉన్నాడు. అతని చేతులు, కాళ్లు తడిసి వాచిపోయాయి. అతని బట్టలు పూర్తిగా తడిసిపోయాయి, అతని నోటిలో బురద కనిపించింది. ”అని చెప్పారు.

ఎగురవేస్తూ..

కాగా.. గుణా జిల్లాలోని పిప్లియా గ్రామంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో పదేళ్ల బాలుడు గాలిపటం ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. 39 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. బోర్‌వెల్‌లో నీరు పడకపోవడంతో దానిపై కేసింగ్‌ కూడా వేయలేదు. బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వి ఆదివారం ఉదయం 9.30 గంటలకు బాలుడ్ని బయటకు తీశారు. ఆ తర్వాత అతడ్ని ఆస్పత్రిలో చేర్చించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బోర్‌వెల్‌లోకి ఆక్సిజన్‌ను పంపింగ్ చేసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిందని రఘోఘర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ తెలిపారు. బాలుడ్ని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారని అన్నారు. ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీలో 700 అడుగుల బోరుబావిలో మూడేళ్ల చిన్నారి పడిపోయింది. ఏడ్రోజులుగా చిన్నారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు వారాల క్రితం, రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో బోరుబావిలో పడి ఐదేళ్లబాలుడు చనిపోయాడు. 55 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన బాలుడ్ని బయటకు తీశారు. అయినప్పటికీ అతడ్ని కాపాడలేకపోయారు.

Advertisement

Next Story

Most Viewed