Tragedy:‘ఆడబిడ్డలకే జన్మనిస్తావా?’.. భార్యకు నిప్పంటించిన భర్త

by Jakkula Mamatha |   ( Updated:2024-12-29 07:57:19.0  )
Tragedy:‘ఆడబిడ్డలకే జన్మనిస్తావా?’.. భార్యకు నిప్పంటించిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే కొందరు తండ్రుల బుద్ధి మాత్రం మారట్లేదు. కొన్ని చోట్ల మగపిల్లలే కావాలంటూ భార్యను చిత్రహింసలకు గురి చేస్తూ.. కడతేర్చుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లకు జన్మనిచ్చిందని కనీస మానవత్వం లేకుండా కట్టుకున్న భార్యకు నిప్పటించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర(Maharashtra)లోని పర్భానీలో ఉత్తమ్ కాలే అనే వ్యక్తి ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని భార్య పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

ఉత్తమ్ భార్య మైనాకు వరుసగా ఇద్దరు కూతుళ్ల తర్వాత మూడోసారి కూడా కూతురే పుట్టింది. ముగ్గురు కుమార్తెలు కావడంతో ఉత్తమ్ తరచూ భార్యను అసహ్యించుకోవడం ఆమెతో గొడవపడటం చేసేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి వాగ్వాదం మరింత పెరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన ఆయన.. భార్య పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మైనా కేకలు వేస్తూ ఇంటి బయటకు వెళ్ళింది. వెంటనే స్థానికులు మంటలు(fires) ఆర్పీ ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. మార్గమధ్యలోనే ఆమె మరణించింది. ఆమె సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Advertisement

Next Story