DGP: తెలంగాణలో శాంతిభద్రతలపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
DGP: తెలంగాణలో శాంతిభద్రతలపై డీజీపీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మైనర్ ఘటనలు మినహా తెలంగాణ(Telangana)లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ జితేందర్(DGP Jitender) అన్నారు. నూతన సంవత్సరం సమీపిస్తోన్న వేళ ఏడాది పాటు చోటుచేసుకున్న నేర వివరాలు మీడియాకు వెల్లడించారు. 2024లో 2,34,158 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. జీరో డ్రగ్స్ స్టేట్(Zero Drugs State)గా తెలంగాణను నిలపాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఈ ఏడాది 20 టన్నుల గంజాయి సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. సీజ్ చేసిన గంజాయి విలువ రూ. 142 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 48 డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందని అన్నారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేట్ పెరిగింది.. దేశంలో తొలిసారి రూ. 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుంచి విడిపించాం తెలంగాణ డీజీపీ స్పష్టం చేశారు.

Advertisement

Next Story