‘లైలా’ మూవీ నుంచి ‘సోను మోడ‌ల్’ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన విశ్వక్ సేన్..(వీడియో)

by Kavitha |   ( Updated:2024-12-29 08:40:38.0  )
‘లైలా’ మూవీ నుంచి ‘సోను మోడ‌ల్’ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన విశ్వక్ సేన్..(వీడియో)
X

దిశ, సినిమా: రామ్ నారాయణ్ దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటింస్తోంది. ఇక ఈ చిత్రం భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే విడుదల డేట్ దగ్గర పడటంతో చిత్రబృదం ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి వ‌రుస‌గా అప్‌డేట్‌లు ఇస్తూ ఈ మూవీపై అంచ‌నాల‌ను పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి ‘సోను మోడ‌ల్’ అనే ఫస్ట్ పాట‌ను విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌లో విశ్వ‌క్ సేన్ మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. మరి మీరు సోను మోడల్ సాంగ్‌ను చూసేయండి. కాగా ఈ సినిమాకు స్వయంగా విశ్వక్ సేన్ లిరిక్స్ అందించడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed